News September 17, 2024
నేటి ముఖ్యాంశాలు
* TG: సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
* రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడ్రా.. రండి: CM రేవంత్ రెడ్డి
* తెలంగాణ తల్లిని అవమానిస్తారా?: KTR
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ
* AP: ఐటీలో ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే: CBN
* రాజధాని రైతుల ఖాతాల్లో కౌలు డబ్బులు జమ
* చంద్రబాబు పేదల వ్యతిరేకి: జగన్
* కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార కేసు
Similar News
News October 12, 2024
ఇజ్రాయెల్‌కు సాయం చేయొద్దు.. ఆ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు
తమపై దాడికి ఇజ్రాయెల్‌కు సహకరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని పొరుగున ఉన్న అరబ్ దేశాలు, గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ దాడి నేపథ్యంలో ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమపై దాడికి భూభాగం-గగనతలం వాడుకునేలా అనుమతిస్తే ప్రతీకారం తప్పదని ఆయా దేశాలకు రహస్య దౌత్య మాధ్యమాల ద్వారా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
News October 12, 2024
గౌతమ్ గంభీర్‌పై నెటిజన్ల ఆగ్రహం
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ ఫ్యాంటసీ క్రికెట్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. మద్యం, పొగాకు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు తాను వ్యతిరేకమని గంభీర్ గతంలో చెప్పారు. మరి ఇప్పుడు మాట తప్పి డబుల్ స్టాండర్డ్స్ ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పైపెచ్చు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న వ్యక్తి ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News October 12, 2024
INDvBAN: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 మ్యాచుల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. భారత జట్టు: సంజూ, అభిషేక్, సూర్య, నితీశ్, హార్దిక్, పరాగ్, రింకూ, సుందర్, చక్రవర్తి, బిష్ణోయ్, మయాంక్