News October 29, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* ANR జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి
* TG: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించిన ఈఆర్సీ
* హైదరాబాద్ పై రేవంత్ పగబట్టారు: కేటీఆర్
* ఫామ్ హౌజ్ పార్టీ.. హైకోర్టు కీలక ఆదేశాలు
* AP: ఉచిత సిలిండర్ పథకానికి రూ.895 కోట్ల విడుదలకు ఉత్తర్వులు
* చంద్రబాబు వచ్చాక రూ.47 వేల కోట్ల అప్పు: పేర్ని నాని

Similar News

News November 10, 2024

దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News November 10, 2024

రాష్ట్రంలో 243 కులాలు: ప్రభుత్వం

image

TG: రాష్ట్రంలో మొత్తం 243 రకాల కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీల్లో 134, ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18 సామాజిక వర్గాలున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన నేపథ్యంలో కులాలకు కోడ్‌లను కేటాయించింది. కులం, మతం లేదన్న వారికీ ఓ కోడ్‌ను కేటాయించింది. ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా కోడ్‌లతో డేటా సేకరిస్తోంది. భూసమస్యలపైనా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది.

News November 10, 2024

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సమావేశాల తొలిరోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ వెంటనే సభను స్పీకర్ వాయిదా వేస్తారు. ఈ సమావేశాలు 11న ప్రారంభమై 11రోజులు కొనసాగే అవకాశం ఉంది.