News December 19, 2024
ఈనాటి ముఖ్యాంశాలు
* రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ అశ్విన్
* జమిలి కోసం జేపీసీ ఏర్పాటు
* రూ.76వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాం: పవన్
* రేపు ఏపీలో భారీ వర్షాలు
* పరిటాల రవి హత్య కేసు నిందితులకు బెయిల్
* TG: జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
* రాజ్‌భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ నిరసన
* ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరగలేదు: KTR
* ముంబై పడవ ప్రమాదంలో 13 మంది దుర్మరణం
Similar News
News January 26, 2025
వీర జవాన్లకు సీఎం రేవంత్ నివాళి
TG: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని వీర జవాన్ల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం సీఎం అక్కడే జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు.
News January 26, 2025
వెబ్ సిరీస్ చూసి.. భార్యను ముక్కలుగా నరికి..
భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. శవాన్ని ఎలా ముక్కలు చేసి, మాయం చేయాలి? అనే విషయాలను నిందితుడు గురుమూర్తి OTTలోని ఓ క్రైమ్ వెబ్‌సిరీస్‌లో చూసినట్లు విచారణలో తేలింది. ముక్కలను కరిగించడానికి అవసరమైన కెమికల్స్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూశాడట. సెన్సార్ కట్‌లు లేకుండా OTTలో ఏదైనా చూపించడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మీరేమంటారు?
News January 26, 2025
డా.నాగేశ్వర్‌రెడ్డి గురించి తెలుసా?
దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డా. నాగేశ్వర్‌రెడ్డి నిలిచారు. 2002లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ అందుకున్న ఆయనకు కేంద్రం తాజాగా పద్మ విభూషణ్ ప్రకటించింది. వైజాగ్‌లో జన్మించిన ఆయన కర్నూలులో MBBS, మద్రాస్‌లో MD, చండీగఢ్‌లో DM పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదిగి HYDలో AIG ఆస్పత్రిని స్థాపించారు. రూ.కోట్ల జీతం కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలను అందిస్తున్నారు.