News January 12, 2025

ఈనాటి ముఖ్యాంశాలు

image

* ‘గ్రీన్ ఎనర్జీ’లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: చంద్రబాబు
* మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు: రేవంత్
* రూ.10 లక్షలతో బుక్స్ కొన్న పవన్ కళ్యాణ్
* కొండపోచమ్మ డ్యామ్‌లో మునిగి ఐదుగురి మృతి
* ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వుల ఉపసంహరణ
* నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట
* అరనిమిషంలో 10కోట్ల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయగలను: మోదీ
* ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

Similar News

News January 25, 2025

బాలీవుడ్‌లో ఐక్యత లేదు: అక్షయ్ కుమార్

image

హిందీ చిత్ర పరిశ్రమలో ఐక్యత లోపించిందని నటుడు అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘నాకే అవకాశం దక్కితే పరిశ్రమలో ఐక్యత తీసుకురావడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటా. ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకునేలా అందరూ కలిసి పనిచేయాలి. సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాన్ని కనుగొనాలి. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఇతర పరిశ్రమలపైనా అది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

News January 25, 2025

ఐసీసీ మెన్స్ టీ20 టీమ్.. కెప్టెన్‌గా రోహిత్

image

మెన్స్ టీ20 టీమ్-2024ను ఐసీసీ ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంచుకుంది. భారత్ నుంచి రోహిత్‌తో పాటు హార్దిక్, బుమ్రా, అర్ష్‌దీప్‌కు చోటు దక్కింది. 2024 టీ20 WCలో 378 రన్స్ చేసిన రోహిత్, టోర్నీ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

టీమ్: రోహిత్(C), హెడ్, సాల్ట్, బాబర్ ఆజమ్, పూరన్(WK), సికందర్ రజా, హార్దిక్, రషీద్ ఖాన్, హసరంగ, బుమ్రా, అర్ష్‌దీప్.

News January 25, 2025

మహారాష్ట్రలో బస్సు ఛార్జీలు పెంపు

image

మహారాష్ట్రలో RTC బస్సు ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధరపై 14.95% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అటు ఆటో, ట్యాక్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆటో ఛార్జీ రూ.23 నుంచి రూ.26కి, టాక్సీ ఛార్జీ రూ.28 నుంచి రూ.31కి చేరింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా RTC ఛార్జీలను పెంచింది.