News February 19, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలి: CM చంద్రబాబు
* ఎవరినీ వదిలిపెట్టం.. బట్టలు ఊడదీసి నిలబెడతాం: YS జగన్
* చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP
* విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి
* సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా ఉంచుతాం: రేవంత్
* రేవంత్ నిజాయితీగల మోసగాడు: KTR

Similar News

News March 22, 2025

నీటి ఉధృతితో సహాయక చర్యలకు ఆటంకం

image

TG: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఊట నీటి ఉధృతి పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అటు నిత్యం సహాయక చర్యలు కొనసాగేలా కార్మికుల పని షిఫ్టులను 3 నుంచి 5కు పెంచారు. 28 రోజుల కింద టన్నెల్‌లో 8 మంది గల్లంతు కాగా ఒకరి మృతదేహాన్ని ఇటీవల వెలికితీశారు. మరో ఏడుగురి ఆచూకీ లభించాల్సి ఉంది.

News March 22, 2025

IPL: ఆ రికార్డు బ్రేక్ చేసేదెవరో?

image

నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో కొన్ని రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175), అత్యధిక సిక్సర్లు(357) విధ్వంసకర బ్యాటర్ గేల్ పేరిట ఉన్నాయి. సిక్సర్ల రికార్డుకు ఇతర ఆటగాళ్లు చాలా దూరంలో ఉన్నా అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడున్న ప్లేయర్లలో ఏ ఆటగాడు ఆ రికార్డు బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు? COMMENT.

News March 22, 2025

బ్యాంకుల సమ్మె వాయిదా

image

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

error: Content is protected !!