News March 25, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: 2029కల్లా పేదరికాన్ని నిర్మూలించడమే మా సంకల్పం: CBN
* చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది: పవన్
* ఏపీలో రూ.2వేల కోట్ల లిక్కర్ స్కామ్: ఎంపీ లావు
* అరటి రైతులకు రూ.1.10 లక్షలు: అచ్చెన్న
* TG: వారికి రుణమాఫీపై మాట్లాడే హక్కు లేదు: తుమ్మల
* రేవంత్‌వి దివాలాకోరు రాజకీయాలు: హరీశ్ రావు
* రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత
* పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు

Similar News

News January 4, 2026

ట్రంప్ తర్వాతి టార్గెట్ ఆ 3 దేశాలేనా?

image

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించిన జోష్‌లో ఉన్న US అధ్యక్షుడు ట్రంప్.. మెక్సికో, క్యూబా, కొలంబియాకూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మెక్సికోను డ్రగ్ ముఠాలు నడుపుతున్నాయని, కొలంబియా కొకైన్ ఫ్యాక్టరీలకు అడ్డాగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అమెరికాను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేసేందుకు ఆ దేశాల్లోనూ ఏదో ఒకటి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన లాటిన్ అమెరికా దేశాల్లో కలకలం రేపుతోంది.

News January 4, 2026

సుదర్శన చక్రం నుంచి దుర్వాసుడు ఎలా తప్పించుకున్నాడు?

image

సుదర్శన చక్రం నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి దుర్వాసుడు బ్రహ్మ, శివుని వేడుకుంటాడు. కానీ వారు చేతులెత్తేస్తారు. చివరికి విష్ణుమూర్తిని శరణు కోరగా ‘నా భక్తులే నా హృదయం. అంబరీషుడిని క్షమాపణ కోరితేనే విముక్తి’ అని చెబుతారు. దీంతో దుర్వాసుడు అంబరీషుని పాదాలపై పడతాడు. దయామయుడైన అంబరీషుడు ప్రార్థించడంతో సుదర్శన చక్రం శాంతించి వెనక్కి వెళ్తుంది. భక్తుని పట్ల అహంకారం పనికిరాదని దుర్వాసుడు గ్రహిస్తాడు.

News January 4, 2026

NIT గోవాలో పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>NIT<<>> గోవాలో 8 JRF, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech/B.E./M.Tech./M.E.ఉత్తీర్ణతతో పాటు NET/GATE స్కోరు సాధించి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.37వేలు+HRA, ఇతర అలవెన్సులు, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు నెట్ అర్హత లేకపోతే రూ.30వేలు+HRA, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nitgoa.ac.in