News July 27, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 27, శనివారం ఫజర్: తెల్లవారుజామున 4:35 గంటలకు, సూర్యోదయం: ఉదయం 5:54 గంటలకు, జొహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు, అసర్: సాయంత్రం 4:53 గంటలకు, మఘ్రిబ్: సాయంత్రం 6:51 గంటలకు, ఇష: రాత్రి 8.10 గంటలకు. నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 6, 2026

సక్సెస్‌తో వచ్చే కిక్కే వేరు: CBN

image

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్‌లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.

News January 6, 2026

బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

image

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్‌ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్‌ (లేదా) 2mlహెక్సాకొనజోల్‌ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్‌ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్‌ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్‌ కలిపి పిచికారీ చేయాలి.

News January 6, 2026

విద్యా వ్యవస్థలో మార్పులతోనే ఉద్యోగాలు!

image

విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక మళ్లీ కోచింగ్ <<18774837>>సెంటర్ల<<>> చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా ‘నైపుణ్యాధారిత విద్య’ను అందించాలి. సిలబస్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. క్యాంపస్ నుంచే విద్యార్థులు జాబ్స్ సాధించేలా స్కిల్స్ పెరిగితేనే విద్యా వ్యవస్థ సక్సెస్ అయినట్లు. ఏమంటారు?