News July 27, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: జులై 27, శనివారం ఫజర్: తెల్లవారుజామున 4:35 గంటలకు, సూర్యోదయం: ఉదయం 5:54 గంటలకు, జొహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు, అసర్: సాయంత్రం 4:53 గంటలకు, మఘ్రిబ్: సాయంత్రం 6:51 గంటలకు, ఇష: రాత్రి 8.10 గంటలకు. నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 24, 2025
ఉగ్ర దాడి.. మరో విషాదగాథ

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి ఘటనలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీ(33)కి రెండేళ్ల కిందటే పెళ్లైంది. UAEలో పనిచేస్తున్న అతను సిమ్లాలో ఓ పెళ్లి కోసం ఇటీవలే భార్యతో కలిసి INDకు వచ్చారు. అది పూర్తయ్యాక పహల్‌గామ్ వెళ్లి టెర్రరిస్టుల చేతిలో మరణించారు. ఇతని తండ్రి పదేళ్ల కిందటే చనిపోగా తల్లి జ్యోతి కష్టపడి చదివించారు. నీరజ్ చనిపోవడంతో తల్లి, భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు.
News April 24, 2025
SRH ఇక ఇంటికే..?

ఈ ఏడాది IPLలో SRH ప్లే ఆఫ్స్ ఆశలు ఇక ముగిసినట్లేనని క్రికెట్ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 8 మ్యాచులాడి రెండే గెలవడం, రన్‌రేట్ మరీ ఘోరంగా ఉండటం, ఇప్పటికే 2 జట్లు 12 పాయింట్లు, 4 జట్లు 10 పాయింట్లు సాధించడంతో మిగిలిన అన్ని మ్యాచులూ గెలిచినా SRH ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనంటున్నారు. నిన్న రాత్రి ముంబై మీద సన్‌రైజర్స్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లోనూ రైజర్స్ విఫలమవుతున్నారు.
News April 24, 2025
ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య మరోసారి వాగ్వాదం

ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా పరిగణించి, నాటోలో ఎప్పటికీ చేరనని హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షున్ని ట్రంప్ కోరారు. దీనికి జెలెన్‌స్కీ ఒప్పుకోకపోవడంతో US అధ్యక్షుడిగా ఒబామా ఉన్న కాలంలోనే క్రిమియా రష్యాలో కలిసిందని ఆ విషయంపై ప్రశ్నే తలెత్తదని ట్రంప్ మండిపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విరమణపై ఇద్దరు నేతలు లండన్‌లో చర్చలు జరిపారు.