News August 15, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: ఆగస్టు 15, గురువారం ✒ ఫజర్: తెల్లవారుజామున 4:43 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 5:59 గంటలకు ✒ జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:48 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6:42 గంటలకు ✒ ఇష: రాత్రి 7.57 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News September 14, 2024
ముగిసిన వైసీపీ నేతల విచారణ
AP: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల విచారణ ముగిసింది. జోగి రమేశ్, దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంను మంగళగిరి పోలీసులు విచారించారు. కాసేపటి క్రితం వారు పీఎస్ నుంచి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించారు.
News September 14, 2024
ఖైరతాబాద్ గణేశ్.. నిమజ్జనం ఎన్ని గంటలకంటే?
TG: ఈ నెల 17న హైదరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం జరగనుంది. దీని కోసం సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 30వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు HYD కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనాన్ని మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 గంటలకు గణనాథుడికి పూజలు పూర్తి చేసి నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు చెప్పారు.
News September 14, 2024
తొలి టెస్టుకు టీమ్ ఇండియా వ్యూహమేంటో..!
బంగ్లాతో తొలి టెస్టులో భారత్ వ్యూహమేంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ పిచ్‌లలో రెండు రకాలు కనిపిస్తున్నాయి. నల్లమట్టి పిచ్‌పై స్పిన్నర్లు, ఎర్రమట్టి పిచ్‌పై పేసర్లు సాధన చేశారు. ఈ రెండింటిపైనా బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలమే అయినప్పటికీ పేస్‌కు అనుకూలమైన ఎర్రమట్టి పిచ్‌ను మ్యాచ్ కోసం భారత్ రెడీ చేయించింది. దీంతో అసలు టీమ్ ఇండియా వ్యూహమేంటన్న చర్చ జరుగుతోంది.