News September 10, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: సెప్టెంబర్ 10, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:37 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:22 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News October 10, 2024
APకి రూ.7,211 కోట్లు, TGకి రూ.3,745 కోట్లు
OCT నెలకుగాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. అడ్వాన్స్ ఇన్‌స్టాల్‌మెంట్ ₹89,086crతో కలిపి మొత్తం ₹1,78,173crను పంపిణీ చేసింది. అత్యధికంగా UPకి ₹31,962cr, బిహార్‌కు ₹17,921cr, MPకి ₹13,987cr అందించింది. ఇక APకి ₹7,211cr, TGకి ₹3,745cr రిలీజ్ చేసింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాల మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి ఈ సాయాన్ని అందించినట్లు పేర్కొంది.
News October 10, 2024
కమిన్స్ వల్లే వారిద్దరూ రాణిస్తున్నారు: పాక్ మాజీ క్రికెటర్
SRH ఆటగాళ్లు అభిషేక్, నితీశ్ భారత్‌కు రాణించడం వెనుక ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ పాత్ర ఉందని పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నారు. ‘వారిద్దరికీ IPLలో కమిన్స్ ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదు. NKRను మిడిల్ ఆర్డర్‌లో పంపడం, కీలక ఓవర్లలో బౌలింగ్ ఇవ్వడం, శర్మని ఓపెనర్‌గా కొనసాగించడం వరకు ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించారు’ అని పేర్కొన్నారు. బంగ్లాతో నిన్నటి మ్యాచ్‌లో నితీశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగారు.
News October 10, 2024
త్వరలోనే వైసీపీ దుకాణం శాశ్వతంగా మూత: ఎమ్మెల్యే జీవీ
AP: మాజీ సీఎం జగన్ గుడ్ బుక్ రాస్తామంటున్నారని, ఆయన చేసిన పాపాలకు రామకోటి రాసుకుంటే పుణ్యం వస్తుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఆయనకు కలలో కూడా లోకేశ్ రెడ్ బుక్కే తిరుగుతున్నట్లు ఉందని సెటైర్లు వేశారు. వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ జగనే అన్నారు. త్వరలోనే ఆ పార్టీ దుకాణం శాశ్వతంగా మూతపడటం ఖాయమని జోస్యం చెప్పారు.