News November 6, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: నవంబర్ 6, బుధవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:03 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:17 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:07 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:43 గంటలకు ✒ ఇష: రాత్రి 6.57 గంటలకు ✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News December 9, 2024
రోహిత్ శర్మ, షమీ మధ్య తీవ్ర వాగ్వాదం!
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్, స్టార్ పేసర్ మహ్మద్ షమీ గొడవ పడినట్లు నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ‘న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా బెంగళూరు టెస్టులో ఓటమి అనంతరం NCAలో ఉన్న షమీని రోహిత్ కలిశాడు. తనకు గాయమైందని, పూర్తి ఫిట్‌గా లేనని అంతకుముందు రోహిత్ మీడియాతో చెప్పడంపై షమీ ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది’ అని పేర్కొంది.
News December 9, 2024
మేం దేశభక్తులం, యాంటీ ఇండియాకు వ్యతిరేకం: కాంగ్రెస్
BJPవి డార్క్ వెబ్‌కు పరిమితమైన డార్క్ ఫాంటసీస్ అని కాంగ్రెస్ MP కార్తీ చిదంబరం అన్నారు. డీప్‌స్టేట్‌పై వచ్చేవన్నీ కుట్ర సిద్ధాంతాలని కొట్టిపారేశారు. ‘సోనియా గాంధీ, సొరోస్ మధ్య లింక్స్ సీరియస్ మ్యాటర్. దేశ వ్యతిరేక శక్తులపై ఏకమై పోరాడాలి’ అన్న <<14829726>>కిరణ్ రిజిజు<<>>పై మండిపడ్డారు. ‘భారత సమగ్రత, సార్వభౌమత్వానికి మేం కట్టుబడతాం. మేం దేశభక్తులం, జాతీయవాదులం’ అని స్పష్టం చేశారు. SP, RJD MPలూ ఇలాగే స్పందించారు.
News December 9, 2024
చంద్రబాబు, పవన్‌కు థాంక్యూ: బొత్స
AP: నాడు-నేడు ద్వారా స్కూళ్లలో YCP చేసిన అభివృద్ధిని చంద్రబాబు, పవన్ ప్రజలకు మరోసారి చూపించారని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందని, ఈనెల 13న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. కంటైనర్ షిప్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఆరోపించారని, చివరికి ఏం లేదని తేల్చారని పేర్కొన్నారు.