News November 9, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: నవంబర్ 9, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:06 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:42 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News December 11, 2024
రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా: జగన్
AP: రాష్ట్రంలో రేషన్ మాఫియా మళ్లీ వచ్చిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజలకు నాణ్యమైన స్వర్ణరకం బియ్యం ఇవ్వడం లేదు. సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం ఇస్తున్నారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడే బియ్యం అక్రమ ఎగుమతులు చేస్తున్నారు. కానీ నిందలు మాపై వేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News December 11, 2024
ఇంకా జోరు తగ్గని ‘దేవర’
ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ విడుదలై మూడు నెలలు దాటినా జోరు కొనసాగిస్తోంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ వేదికపై అత్యధికంగా వీక్షించిన రెండో దక్షిణాది చిత్రంగా నిలిచింది. వరుసగా 5వారాల పాటు టాప్ 10లో ట్రెండ్ అవుతోందని దేవర మూవీ టీమ్ తెలిపింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్‌వైడ్ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
News December 11, 2024
ట్రంప్‌కు కాబోయే కోడలికి కీలక పదవి
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే కోడలికి కీలక పదవి కట్టబెట్టారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఫియాన్సీ కింబర్లీ గిల్ఫోయిల్‌ను గ్రీస్‌కు US రాయబారిగా నియమించారు. కింబర్లీ గతంలో ఫాక్స్ న్యూస్ హోస్ట్‌గా పనిచేశారు. 2020లో ట్రంప్ జూనియర్‌తో నిశ్చితార్థం జరిగింది. కాగా జూనియర్ ట్రంప్ ఇప్పటికే వానెసాతో పెళ్లై విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు పిల్లలు ఉన్నారు.