News November 21, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: నవంబర్ 21, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5:09
సూర్యోదయం: ఉదయం 6:24
దుహర్: మధ్యాహ్నం 12:02
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.55
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News December 9, 2024
‘పుష్ప-2’ కలెక్షన్స్ సునామీ
‘పుష్ప-2’ సినిమా హిందీలో 4 రోజుల్లోనే రూ.291కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే రూ.86 కోట్లు వసూలు చేసిందని, హిందీ బెల్ట్‌లో ఒక్క రోజులో ఇంత మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని పేర్కొంది. అత్యంత వేగంగా రూ.290 కోట్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించినట్లు తెలిపింది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకూ $9.4M వసూలు చేసినట్లు ప్రకటించింది.
News December 9, 2024
మైగ్రేన్‌తో గుండెపోటు & స్ట్రోక్: వైద్యులు
మారిన జీవనశైలి ఎంతో మందికి మైగ్రేన్ హెడేక్‌ను తెచ్చిపెట్టింది. ప్రపంచంలో 100 కోట్ల మంది దీనితో బాధపడుతున్నారు. దీనిని నెగ్లెక్ట్ చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది గుండెపోటు & స్ట్రోక్‌కు కారణం అవుతుందని చెబుతున్నారు. ‘మైగ్రేన్ ఉన్న వ్యక్తులకు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం ఉంది. 43% హెమరేజిక్ స్ట్రోక్ ప్రమాదం. Migraine with aura వారికి హృదయనాళ మరణ ప్రమాదం ఎక్కువ’ అని పేర్కొంటున్నారు.
News December 9, 2024
సిసోడియా నియోజకవర్గం అవధ్ ఓజాకు
Febలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆప్ 2వ జాబితాను విడుదల చేసింది. పట్పర్‌గంజ్ MLA, సీనియర్ నేత మనీశ్ సిసోడియా ఈసారి జాంగ్‌పురా నుంచి బరిలో దిగనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన సివిల్స్ కోచింగ్ ఫ్యాకల్టీ అవధ్ ఓజా పట్పర్‌గంజ్ నుంచి పోటీ చేయనున్నారు. మొదటి జాబితాలో 11 మంది, రెండో జాబితాలో 20 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది.