News April 16, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: ఏప్రిల్ 16, మంగళవారం ఫజర్: తెల్లవారుజామున గం.4:45 సూర్యోదయం: ఉదయం గం.5:59 జొహర్: మధ్యాహ్నం గం.12:16 అసర్: సాయంత్రం గం.4:42 మఘ్రిబ్: సాయంత్రం గం.6:33 ఇష: రాత్రి గం.07.47 నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News November 17, 2024
BUMRAH vs ASHWIN: ఎవరిదో ఆ రికార్డ్?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తే టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ముంగిట ఓ భారీ రికార్డు ఉంది. ఆసీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కపిల్ దేవ్ (51) పేరిట ఉంది. ప్రస్తుతం అశ్విన్ 39, బుమ్రా 32 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కపిల్ రికార్డును అధిగమించటానికి అశ్విన్‌కు 13, బుమ్రాకు 20 వికెట్లు అవసరం. ఒకవేళ BGT టూర్‌కు ఎంపికైతే షమీ(32)కీ ఈ ఛాన్స్ ఉంది.
News November 17, 2024
కలెక్టర్‌పై దాడి వెనుక కేటీఆర్.. మంత్రి సంచలన ఆరోపణలు
TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి వెనుక కేటీఆర్ ఉండి ఉంటారని మంత్రి సురేఖ ఆరోపణలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను విదేశాల్లో దాచారన్నారు. నిజాలు తేల్చాక KTRపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.
News November 17, 2024
‘కాంతార-2’ నుంచి బిగ్ అప్డేట్
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాంతార ఎ లెజెండ్ చాప్టర్-1’ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. ఇప్పటికే రిలీజైన ‘కాంతార’ భారీ విజయాన్ని అందుకోగా.. ప్రీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, కన్నడతో పాటు మొత్తం 7 భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.