News May 20, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: మే 20, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:23 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:43 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:45 గంటలకు
మఘ్రిబ్: రాత్రి 6:43 గంటలకు
ఇష: రాత్రి 08.02 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News December 23, 2024
ALERT.. 3 రోజులు వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
News December 23, 2024
షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లా
దేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌ను బంగ్లా మధ్యంతర ప్రభుత్వం అధికారికంగా కోరింది. భారత్‌తో ఉన్న ఖైదీల మార్పిడి ఒప్పందం మేరకు న్యాయపరమైన ప్రక్రియ కోసం ఆమెను అప్పగించాల్సిందిగా కోరినట్టు బంగ్లా దేశ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు. హసీనా హయాంలో చెలరేగిన అల్లర్లలో జరిగిన హత్య కేసుల్లో ఆమెపై ఇప్పటికే అభియోగాలు మోపారు.
News December 23, 2024
DHOP మూమెంట్.. స్టార్ హీరోలతో తమన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోలను దర్శకుడు బుచ్చిబాబు తమన్ పంచుకున్నారు. ‘DHOP మూమెంట్’ అంటూ తమన్, నా అభిమాన హీరోలంటూ బుచ్చిబాబు రాసుకొచ్చారు. వీరంతా దుబాయ్‌లో ఓ ఈవెంట్ సందర్భంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ‘వార్-2’ చిత్రంలో నటిస్తున్నారు. కాగా RC నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.