News May 26, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: మే 26, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:47 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:45 గంటలకు
ఇష: రాత్రి 08.05 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News February 12, 2025
పరారీలో MLA: వేట మొదలుపెట్టిన పోలీసులు

ఢిల్లీలోని ఓక్లా MLA అమనతుల్లా ఖాన్ (ఆప్) కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన నిన్నటి నుంచి పరారీలో ఉన్నారు. దీంతో టీములుగా విడిపోయిన అధికారులు ఢిల్లీ, రాజస్థాన్, యూపీలో సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేశారు. త్వరలోనే ఆయన్ను పట్టుకుంటామని అంటున్నారు. ఓ మర్డర్ కేసులో నిందితుడైన షాబాజ్ ఖాన్ తప్పించుకొనేందుకు మద్దతుదారులతో కలిసి ఆయన సాయం చేశారని నిన్న FIR నమోదైంది. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు.
News February 12, 2025
తగ్గిన బంగారం ధర

కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.86,670కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.
News February 12, 2025
బర్డ్ ఫ్లూ అంటే?

బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.