News January 5, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 5, ఆదివారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు ✒సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు ✒ ఇష: రాత్రి 7.13 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 18, 2025
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
TG: రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందొద్దని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కులగణన ఆధారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక పాత రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా ఉత్తమ్ స్పందించారు. అలాంటిదేమీ ఉండదని, పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పారు.
News January 18, 2025
అతనొక్కడే దోషి కాదు.. ట్రైనీ డాక్టర్ తల్లి
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ని కోర్టు దోషిగా తేల్చడంపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ దారుణం వెనుక మరికొందరు ఉన్నారని ఆమె ఆరోపించారు. వారికి కూడా శిక్ష పడ్డప్పుడే న్యాయం జరిగినట్లు భావిస్తామన్నారు. అప్పటివరకు తాము ప్రశాంతంగా నిద్రపోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
News January 18, 2025
రంజీ మ్యాచ్ ఆడనున్న రోహిత్‌శర్మ
ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడనున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. CT జట్టు ప్రకటన సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కొద్దిరోజుల క్రితం హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. జనవరి 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నారు. కాగా 2015లో చివరిసారి అతడు రంజీట్రోఫీలో ఆడారు.