News February 9, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 09, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News March 19, 2025

విడాకుల వార్తలు.. హీరోయిన్ ఏమన్నారంటే?

image

భర్తతో విడాకులు తీసుకోనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ భావన ఖండించారు. ‘పర్సనల్ విషయాలను, భర్తతో దిగిన ఫొటోలను నేను సోషల్ మీడియాలో పోస్టు చేయను. అందుకే మేం విడిపోతున్నామని అనుకుంటున్నారు. కానీ మేం సంతోషంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈమె తెలుగులో ఒంటరి, మహాత్మా, హీరో చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. పలు భాషల్లో దాదాపు 70 చిత్రాల్లో నటించారు. 2018లో కన్నడ నిర్మాత నవీన్‌ను పెళ్లి చేసుకున్నారు.

News March 19, 2025

రైళ్లపై 7,971 రాళ్ల దాడులు: అశ్వినీ వైష్ణవ్

image

2023 నుంచి ఈ ఏడాది FEB వరకు వందేభారత్ సహా ఇతర రైళ్లపై 7,971 రాళ్ల దాడి ఘటనలు జరిగినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కేసుల్లో 4,549 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. దాడుల్లో దెబ్బతిన్న రైళ్ల మరమ్మతులకు రూ.5.79 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలను నియంత్రించేందుకు GRP, జిల్లా పోలీసులతో కలిసి RPF పనిచేస్తోందన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.

News March 19, 2025

గేట్‌లో తెలుగు విద్యార్థి సత్తా.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్

image

AP: నెల్లూరు (D) ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ గేట్‌లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్‌తో మెరిశారు. డేటా సైన్స్, AI టెస్ట్ పేపర్‌లో 100కు గానూ 96.33 మార్కులతో ఈ ఘనత సాధించారు. గతంలో నీట్ పరీక్షలోనూ 57వ ర్యాంకు సాధించిన ఈయన ప్రస్తుతం నోయిడాలో ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో పని చేస్తున్నారు. AIలో ఎంటెక్ చేయాలన్న తన కల సాకారం చేసుకునే లక్ష్యంతోనే కష్టపడి చదివినట్లు నిఖిల్ వివరించారు.

error: Content is protected !!