News March 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 14, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.25 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News February 14, 2026
IND vs PAK: హ్యాండ్ షేక్‌పై పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

T20 WCలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ‘హ్యాండ్ షేక్’ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. Asia Cupలో టీమ్ ఇండియా ప్లేయర్లు పాక్‌తో కరచాలనం చేయకపోవడం పెద్ద దుమారమే రేపింది. దాన్ని గుర్తు చేస్తూ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పటిలాగే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, నిర్ణయం భారత్ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.
News February 14, 2026
T20WC నుంచి ఒమన్ ఔట్

ఇవాళ ఐర్లాండ్ చేతిలో ఓటమితో T20WC-2026 నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ఒమన్ నిలిచింది. గ్రూప్-Bలో ఉన్న ఆ జట్టు లీగ్ దశలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే గ్రూపులో శ్రీలంక, జింబాబ్వే ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలతో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అటు లీగ్ దశలో ఒమన్ తన చివరి మ్యాచ్‌ను FEB 20న ఆస్ట్రేలియాతో ఆడనుంది.
News February 14, 2026
AP వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం: అచ్చెన్న

భారత వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతంగా ఉందని, వ్యవసాయ రంగంలో AP 7.83% వృద్ధి రేటు సాధించిందని మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరిపి రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ-PM కిసాన్ కింద 2025-26లో రూ.6,309 కోట్లు చెల్లించామని.. 2026-27లో దానిని రూ.6,600 కోట్లకు పెంచామన్నారు.


