News March 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 14, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.25 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News March 27, 2025
కొడాలి నానికి ఆపరేషన్

AP: YCP నేత కొడాలి నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు HYDలోని AIG డాక్టర్లు నిర్ధారించారు. ఆయన గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ అయినట్లు గుర్తించి సర్జరీ చేయాలని నిర్ణయించారు. మరికొన్ని వైద్య పరీక్షల అనంతరం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి ఆరోగ్యంపై మాజీ CM జగన్ డాక్టర్లతో మాట్లాడారు. మరోవైపు నాని అనారోగ్యం విషయం తెలిసి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 27, 2025
DANGER: అధికంగా సౌండ్స్ వింటున్నారా?

చుట్టూ ఉన్న ముప్పును మనం గుర్తించలేకపోతున్నాం. సౌండ్ పొల్యూషన్ ఎంతో ప్రమాదకరం. ఏళ్లుగా అధిక సౌండ్స్ వింటున్నట్లైతే అనారోగ్యపడినట్లే. ఇలాంటి వారికి గుండెపోటు, హైబీపీ, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లో శబ్ద కాలుష్యం కారణంగా ఏటా 12000 మంది చనిపోతుండగా లక్షల మందికి నిద్రలేమి సమస్యలొస్తున్నాయి. 55-60 డెసిబెల్స్ దాటిందంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
News March 27, 2025
ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్

TG: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉందని, కానీ పెంచలేదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే పెంచలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో దక్షిణాది నుంచి లోక్‌సభలో 24 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడి పోరాటం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.