News January 9, 2025
రద్దీ కారణంగానే ముందుగా టోకెన్లు జారీ: TTD ఈవో
AP: రేపు ఉ.5 గంటలకు జారీ చేయాల్సిన టోకెన్లను భక్తుల రద్దీ కారణంగా ముందుగానే ప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. మరోవైపు ఎలాంటి బందోబస్తు లేకపోవడమే ఘటనకు కారణమని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించారు.
Similar News
News January 17, 2025
BIG BREAKING: గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు
AP: 14వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘గత ప్రభుత్వం వాటిలో 11 మంది చొప్పున సిబ్బందిని కేటాయించింది. ఇకపై 3,500+ జనాభా పరిధి ఉన్న సచివాలయంలో 8 మంది, 2,500+ ఉన్న చోట ఏడుగురిని, మిగతా వాటిలో ఆరుగురు సిబ్బందిని ఉంచుతాం. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్‌గా ఉంటారు’ అని పేర్కొన్నారు.
News January 17, 2025
ప్రకృతి విలయం నుంచి తేరుకునేందుకు దశాబ్దం!
అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల రూ.లక్షల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వినాశకర కార్చిచ్చు ప్రభావం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఒక దశాబ్ద కాలం పట్టొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. దీనివల్ల మౌలిక సదుపాయాలు, గృహాలు & ప్రకృతికి విస్తృతమైన నష్టం వాటిల్లింది. పురోగతి క్రమంగా ఉన్నప్పటికీ, అధికారులు నగరాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి.
News January 17, 2025
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు.