News September 26, 2024
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అరెస్ట్
సినీ నటుడు అభిషేక్ అరెస్టయ్యారు. SR నగర్, జూబ్లీహిల్స్ పీఎస్‌లలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు కోర్టు కేసులకు హాజరుకాకపోవడంతో వారెంట్లు జారీ అయ్యాయి. దీంతో న్యాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ తర్వాత అతడిని హైదరాబాద్ సీసీఎస్‌కు తరలించారు. గతంలోనూ పలుమార్లు డ్రగ్స్ కేసులో అభిషేక్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News October 4, 2024
అమరావతి మీదుగా NH-16 విస్తరణ: పెమ్మసాని
AP: కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే NH-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. వినుకొండ-గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25KM పొడిగించారన్నారు. ఇది రాజధాని అమరావతిని తాకేలా రూపొందిందని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, విద్యుత్ పనులు చేపడుతుందని తెలిపారు.
News October 4, 2024
మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్
దేశంలోని మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృత, అస్సామీ భాషలకు ఈ స్థాయిని కల్పించనుంది. దీంతో వీటితో కలిపి దేశంలోని సాంప్రదాయ భాషల సంఖ్య 11కు చేరనుంది. ఇప్పటివరకు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు మాత్రమే ఈ స్టేటస్‌ను కలిగి ఉన్నాయి.
News October 4, 2024
ఆ పథకాన్ని తొలగించట్లేదు: ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
AP: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయరంటూ మరోసారి ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని(గతంలో ఆరోగ్య శ్రీ) తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారమని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో ఫేక్ అని తెలిపింది.