News December 13, 2024
ఇబ్బందులెదుర్కొంటున్న టాలీవుడ్ ఫ్యామిలీస్

కాకతాళీయమో, దురదృష్టమో కానీ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాలు గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్ కన్వెన్షన్ విషయంతో పాటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కినేని నాగార్జున కుటుంబం న్యాయపరంగా ముందుకెళ్తోంది. ఇక మంచు కుటుంబం సైతం అంతర్గత తగాదా, జర్నలిస్టుపై దాడి ఘటనల్లో చిక్కుకోగా తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ సైతం అరెస్టయ్యారు.
Similar News
News November 17, 2025
NGKL: చివరి కార్తిక సోమవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

చివరి కార్తీక సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి, సందడి వాతావరణం నెలకొంది.
News November 17, 2025
గొర్రె పిల్లలకు అందించే క్రీపు దాణా తయారీ నమూనా ఫార్ములా

100 కిలోల క్రీపు దాణా తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ నలగగొట్టిన మొక్కజొన్నలు 40 కిలోలు ☛ తవుడు 20 కిలోలు ☛ నూనె తీసిన చెక్క 30 కిలోలు ☛ పప్పులపరం 7 కిలోలు ☛ కిలో ఉప్పు ☛ లవణ మిశ్రమం 2 కిలోలు. వీటిని మిక్స్ చేసి క్రీపు దాణా తయారు చేసుకోవచ్చు. ఈ దాణాను గొర్రె పిల్లలకు 3 నుంచి 7 వారాల వరకు తల్లిపాలతో పాటు అందించాలి. దీన్ని గొర్రె పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి.
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి

సౌదీ <<18308554>>బస్సు<<>> ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 7997959754, 9912919545 నంబర్లకు కాల్ చేయాలని CS సూచించారు. అటు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు.


