News September 5, 2024
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ ప్రణితా సుభాష్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆమెకు ఓ కూతురు ఉండగా, ఇవాళ మరో బిడ్డకు తల్లి అయ్యారు. ఈమె తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, హలో గురు ప్రేమ కోసమే, బ్రహ్మోత్సవం, రభస, డైనమైట్, పాండవులు పాండవులు తుమ్మెద తదితర చిత్రాల్లో నటించారు.
Similar News
News September 17, 2024
గణేశ్ నిమజ్జనం.. తెలంగాణ పోలీసుల సూచన
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ‘గణేశ్ నిమజ్జనంలో ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సాహాలతో పాల్గొనాలి. ఎక్కడా గొడవలకు తావివ్వకూడదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకండి. ఎవరైనా మీకు అమర్యాదగా, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కనిపిస్తే వెంటనే డయల్ 100కి లేదా దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
News September 17, 2024
లక్ అంటే ఇదే.. పొలానికి వెళ్తే వజ్రం దొరికింది!
AP: కర్నూలు(D) తుగ్గలి(M) సూర్యతండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీకి వజ్రం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. అది 8 క్యారెట్ల వజ్రం అని తేల్చారు. పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.5లక్షలకు దానిని కొనుగోలు చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని GSI గుర్తించిన నేపథ్యంలో అక్కడి ప్రజలు వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.
News September 17, 2024
ఈ గణనాథుడిని నిమజ్జనమే చేయరు!
నిమజ్జనమే చేయకుండా గత 75 ఏళ్లుగా వినాయకుడి విగ్రహాన్ని భద్రపరుస్తున్నారనే విషయం మీకు తెలుసా? నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లికి దగ్గరలో ఉన్న పాలజ్(MH)లో కర్ర వినాయకుడిని పూజిస్తారు. ప్రతి ఏటా చవితికి బీరువాలో భద్రపరిచిన కర్ర వినాయకుడిని బయటకు తీసి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల చివరిరోజు వాగుకు తీసుకెళ్లి నీళ్లు చల్లి మళ్లీ భద్రపరుస్తారు.