News August 30, 2024

టాలీవుడ్‌లోనూ కేరళ తరహా కమిటీ వేయాలి: సమంత

image

జస్టిస్ హేమ కమిటీతో మాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో సమంత ఇన్‌స్టాలో కీలక పోస్టు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను ఆమె అభినందించారు. ఇదే బాటలో టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ ‘ది వాయిస్ ఆఫ్ ఉమెన్‌‌’ నడవాలన్నారు. TFIలోనూ ఇలాంటి కమిటీ వేయాలని TG ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల భద్రమైన వాతావరణంలో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందన్నారు.

Similar News

News November 26, 2025

జగిత్యాల: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలి: ఎస్పీ

image

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.

News November 26, 2025

తెంబా బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడు

image

SA క్రికెట్‌లో అద్భుతమైన నాయకుడిగా తనదైన ముద్ర వేస్తున్న కెప్టెన్ తెంబా బవుమా ఇప్పుడు కొత్త సంచలనాలను నమోదు చేస్తున్నారు. 27ఏళ్ల తర్వాత తన జట్టుకు తొలి ICC టైటిల్ అందించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఆయన నిలిచిన విషయం తెలిసిందే. తాజా సిరీస్ విజయంతో 25ఏళ్ల తరువాత భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిపించిన కెప్టెన్‌ అయ్యారు. 12 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 1 డ్రాతో విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా ఉన్నారు.

News November 26, 2025

‘సీఎం’ వివాదాన్ని మేమే పరిష్కరిస్తాం: ఖర్గే

image

కర్ణాటకలో CM పదవి వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్, తాను కలిసి పరిష్కరిస్తామని వెల్లడించారు. కర్ణాటకలో క్షేత్రస్థాయిలో ఉన్న వారు మాత్రమే పరిస్థితిని అంచనా వేయగలరని చెప్పారు. కాగా ఈ విషయంపై రానున్న 48 గంటల్లో రాహుల్‌తో ఖర్గే భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాత సిద్దరామయ్య, DK శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.