News August 30, 2024
టాలీవుడ్‌లోనూ కేరళ తరహా కమిటీ వేయాలి: సమంత
జస్టిస్ హేమ కమిటీతో మాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో సమంత ఇన్‌స్టాలో కీలక పోస్టు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను ఆమె అభినందించారు. ఇదే బాటలో టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ ‘ది వాయిస్ ఆఫ్ ఉమెన్’ నడవాలన్నారు. TFIలోనూ ఇలాంటి కమిటీ వేయాలని TG ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల భద్రమైన వాతావరణంలో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందన్నారు.
Similar News
News September 15, 2024
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
TG: ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నారో? లేదో స్పష్టత ఇవ్వాలని కోరుతూ CM రేవంత్ రెడ్డికి KTR లేఖ రాశారు. ‘ప్రాజెక్టును రద్దు చేస్తే భూములు ఇచ్చిన రైతులకు తిరిగి వారి భూములు అప్పగించండి. ఆ భూముల్ని ఇతర అవసరాలకు వాడితే చట్టపరంగా సమస్యలు తప్పవు. అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లో HYDను నం.1గా చేసేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టాం. రాజకీయాల కోసం TG యువతకు నష్టం చేయొద్దు’ అని లేఖలో పేర్కొన్నారు.
News September 15, 2024
ఇడ్లీ గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇడ్లీ తినడం వల్ల చనిపోయారు. ఓనం పండుగ సందర్భంగా అక్కడ పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సురేశ్(49) అనే వ్యక్తి ఇడ్లీలు తినే పోటీలో పాల్గొన్నారు. ఒకేసారి మూడు ఇడ్లీలు తినగా అవి గొంతులో ఇరుక్కున్నాయి. ఊపిరాడక కుప్పకూలిన అతన్ని నిర్వాహకులు ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది.
News September 15, 2024
వారికి కోరుకున్న చోట స్థలాలిస్తాం: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములిచ్చిన రైతుల నుంచి స్వయంగా అంగీకార పత్రాలు తీసుకున్నారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వచ్చి భూములు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే వారికి కోరుకున్న చోట స్థలాలిస్తామని తెలిపారు. ఐఐటీ రిపోర్ట్ ఆధారంగా రాజధాని నిర్మాణ పనులు చేపడతామన్నారు.