News September 19, 2024

ఒకప్పుడు టమాటాను విషం అనుకునేవారు!

image

పలు పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు టమాటాను విషంగా భావించి భయపడేవారు. అవి తినడం వల్ల చాలామంది కన్నుమూయడమే అందుక్కారణం. మరణ భయంతో దానికి పాయిజన్ యాపిల్ అని పేరు కూడా పెట్టారు. సుమారు 200 ఏళ్ల పాటు ఈ నమ్మకమే ఉండేది. అయితే, ప్రజలు వాడుతున్న ప్యూటర్(pewter) ప్లేట్లలో లెడ్ సారం ప్రమాదకర స్థాయుల్లో ఉంటోందని, టమాటాల్లోని ఆమ్లంతో కలిసి వారి మరణాలకు దారి తీస్తోందని తర్వాత గుర్తించారు.

Similar News

News December 4, 2025

ఏపీకి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నోటీసులు

image

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారంలోపు ప్రాజెక్టు వాస్తవ స్థితిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పోలవరం-నల్లమల సాగర్ డీపీఆర్ కోసం టెండర్లు పిలవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

News December 4, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* TGలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం(D) నాయకన్‌గూడెం చెక్‌పోస్ట్ వద్ద AP CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారు తనిఖీ చేసిన పోలీసులు
* ఈ నెల 11న కడప మేయర్, కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు SEC నోటిఫికేషన్ జారీ.. అవినీతి ఆరోపణలతో ఇటీవల కడప మేయర్‌(YCP)ను తొలగించిన ప్రభుత్వం
* మూడో వన్డే కోసం విశాఖ చేరుకున్న IND, RSA జట్లు.. ఎల్లుండి మ్యాచ్

News December 4, 2025

రూ.5 లక్షలకు అఖండ-2 టికెట్‌

image

AP: అఖండ-2 మూవీ టికెట్‌ను చిత్తూరు MLA గురజాల జగన్‌మోహన్ రూ.5 లక్షలకు కొన్నారు. తనకు బాలకృష్ణపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు MLAను కలిసి సినిమా టికెట్‌ను అందజేశారు. ఓ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే సాంకేతిక సమస్యల కారణంగా అఖండ-2 మూవీ ప్రీమియర్స్‌ను నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.