News September 19, 2024

ఒకప్పుడు టమాటాను విషం అనుకునేవారు!

image

పలు పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు టమాటాను విషంగా భావించి భయపడేవారు. అవి తినడం వల్ల చాలామంది కన్నుమూయడమే అందుక్కారణం. మరణ భయంతో దానికి పాయిజన్ యాపిల్ అని పేరు కూడా పెట్టారు. సుమారు 200 ఏళ్ల పాటు ఈ నమ్మకమే ఉండేది. అయితే, ప్రజలు వాడుతున్న ప్యూటర్(pewter) ప్లేట్లలో లెడ్ సారం ప్రమాదకర స్థాయుల్లో ఉంటోందని, టమాటాల్లోని ఆమ్లంతో కలిసి వారి మరణాలకు దారి తీస్తోందని తర్వాత గుర్తించారు.

Similar News

News October 7, 2024

మీ భార్యను మీరే ఇందులోకి లాగారు: సిద్దరామయ్యపై HD ఫైర్

image

కర్ణాటక CM సిద్దరామయ్యపై JDS లీడర్, కేంద్రమంత్రి HD కుమారస్వామి ఫైరయ్యారు. ‘ఇంట్లో ఉన్న మీ భార్యను మీరే ముడా స్కామ్‌లోకి లాగారు. మీరు చేసిన తప్పులే దానికి కారణం. పైనుంచి మమ్మల్ని ఆరోపిస్తున్నారు’ అని దుయ్యబట్టారు. తన భార్య విషయంలో ప్రతిపక్షాన్ని ప్రజలు క్షమించగలరా అని సిద్దరామయ్య చేసిన ఎమోషనల్ స్పీచ్‌పై HD ఇలా స్పందించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులపైనా డిబేట్‌కి రావాలని ఆయన CMకు ఛాలెంజ్ చేశారు.

News October 7, 2024

నేడు అకౌంట్లలోకి డబ్బులు

image

AP: సాంకేతిక కారణాలతో వరద పరిహారం అందని బాధితులకు నేడు ప్రభుత్వం డబ్బులు చెల్లించనుంది. ఎన్టీఆర్ జిల్లాల్లో 15వేలు, అల్లూరి జిల్లాలో 4,620 మంది, ఇతర జిల్లాల్లోని పలువురు బాధితుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. వీరందరికి దాదాపు రూ.18 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 98 శాతం మంది బాధితులకు రూ.584 కోట్ల పరిహారం చెల్లించిన విషయం తెలిసిందే.

News October 7, 2024

ఇకపై శ్రీవారి లడ్డూలు వేగంగా పంపిణీ

image

AP: భక్తులకు శ్రీవారి లడ్డూలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దర్శన టికెట్ లేని భక్తులు తమ ఆధార్ కార్డును కౌంటర్‌లో ఇస్తే అందులోని వివరాలు ఎంటర్ చేసుకుని 2 లడ్డూలు ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కువ సమయం వృథా అవుతోంది. దీంతో ఆధార్‌ను క్షణాల్లో స్కాన్ చేసే అధునాతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.