News September 29, 2024

రేపు మ.2 గంటలకు ‘రా మచ్చా మచ్చా’

image

శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్- కియారా జంటగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ రిలీజ్‌పై మరో అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కొంపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. నిన్న విడుదలైన ప్రోమోకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News November 19, 2025

భద్రాద్రి: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తులసీరాం ఆత్మహత్య

image

పినపాక మండలం ఈ బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తులసీరాం బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. తులసీరాం మృతి పట్ల ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వినితో పాటు కార్యాలయ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలియజేశారు.

News November 19, 2025

NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

image

నిజామాబాద్‌లోని కలెక్టరేట్‌లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్‌తో సమీక్షలో ఉన్నారు.

News November 19, 2025

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రశాంతి నిలయానికి బయలుదేరారు. సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. తర్వాత బాబా గౌరవార్థం స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేస్తారు. <<18326817>>100<<>> ఆవులను రైతులకు పంపిణీ చేస్తారు. హిల్‌ వ్యూ స్టేడియంలో నిర్వహించే వేడుకలలో పాల్గొని ప్రసంగిస్తారు.