News April 10, 2024

రేపు దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్

image

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతోన్న ‘లక్కీ భాస్కర్’ నుంచి అప్డేట్ వచ్చింది. ‘ఈరోజు రంజాన్ జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. టీమ్ లక్కీ భాస్కర్ నుంచి మీకో చిన్న గిఫ్ట్. రేపు తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సినిమా టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నాం’ అని దుల్కర్ ట్వీట్ చేశారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు.

Similar News

News February 12, 2026

రహేజాకు భూములపై మండలిలో వాడీవేడి చర్చ

image

AP: కంపెనీలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ సాగింది. రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన రహేజాకు 99 పైసలకే భూములు ఎలా ఇస్తారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స, YCP MLC మాధవరావు ప్రశ్నించారు. విశాఖలోని భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. రహేజా బిల్డింగ్స్‌లో అనేక కంపెనీలు వస్తున్నాయని, వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు.

News February 12, 2026

ఢిల్లీ బాంబు పేలుడుకు జైషేతో లింకులు: UN

image

ఢిల్లీ <<18265346>>బాంబు బ్లాస్ట్‌<<>>కు పాక్‌కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌‌(JeM)తో సంబంధం ఉందని UN ఉగ్రవాద నిరోధక పర్యవేక్షణ బృందం పేర్కొంది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఈ సంస్థ ప్రత్యేకంగా మహిళా వింగ్‌ను ఏర్పాటు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. JeMతో ప్రమాదమని పలు దేశాలు చెబుతుంటే ఓ సభ్య దేశం మాత్రం ఆ సంస్థ పని చేయడంలేదని అంటోందని విమర్శించింది. UNSCకి సమర్పించిన నివేదికలో <<16299135>>పహల్గామ్‌<<>> దాడినీ ప్రస్తావించింది.

News February 12, 2026

మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

image

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు షుగర్ హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలుంటాయి. వీటిని గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.