News November 16, 2024
రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధం
TG: వివిధ శాఖల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలను TGPSC సిద్ధం చేసింది. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-3 ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని TGPSC సూచించింది.
Similar News
News November 16, 2024
1,400 కళాఖండాలను తిరిగిచ్చిన అమెరికా
భారత్‌లో దొంగతనానికి గురై వివిధ మార్గాల ద్వారా తమ దేశానికి చేరిన 1,400కు పైగా కళాఖండాలు, వస్తువులను US తిరిగిచ్చింది. వీటి విలువ $10 మిలియన్లు ఉంటుందని తెలిపింది. ఇందులో ఖగోళ నర్తకి ఇసుక రాయి శిల్పం అరుదైనదని, ఇది ఇండియా నుంచి లండన్‌కు, అక్కడి నుంచి US మ్యూజియంకు చేరిందని వెల్లడించింది. అక్రమ రవాణాదారుల నెట్‌వర్క్‌పై ఫోకస్ చేశామని, దీని వెనుక తమిళనాడుకు చెందిన సుభాష్ కపూర్ హస్తం ఉందని పేర్కొంది.
News November 16, 2024
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్లు
టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు. సడన్‌గా వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అంతా సర్ప్రైజ్ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్‌లో ‘ఉండిపో’, ఆచార్య సినిమాలో ‘నీలాంబరి’ పాటలు పాడారు. వేర్వేరుగా ఎన్నో హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు.
News November 16, 2024
MP మీటింగ్‌లో మటన్ గొడవ.. కొట్టుకున్నారు
UPలోని మిర్జాపుర్‌లో BJP MP వినోద్ కుమార్ బింద్ కార్యాలయంలో ఓ కమ్యూనిటీ సమావేశం, విందు ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది హాజరయ్యారు. విందుకు వచ్చిన అతిథుల్లో ఒక వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా కేవలం గ్రేవీ వేయడంతో రచ్చ మొదలైంది. తనకు ముక్కలు వేయలేదని వాగ్వాదానికి దిగిన సదరు అతిథి వడ్డించే వ్యక్తి చెంపపై కొట్టడం, తోపులాట జరిగి కొట్టుకున్నారు. ఆ తర్వాత కొందరు కవర్లలో మటన్‌ను నింపుకొని వెళ్లిపోయారు.