News November 16, 2024
రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలకు సర్వం సిద్ధం
TG: వివిధ శాఖల్లో 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలను TGPSC సిద్ధం చేసింది. 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రేపు ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-3 ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని TGPSC సూచించింది.
Similar News
News December 10, 2024
నేను ఏ పార్టీ మారలేదు: ఆర్.కృష్ణయ్య
AP: రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, వాళ్లే పిలిచి టికెట్ ఇచ్చారని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసమే పనిచేస్తానని తెలిపారు. కేంద్రంలో బీసీల నాయకత్వమే ఎక్కువని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు అవకాశమిచ్చిన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
News December 10, 2024
ఒక్క టూర్‌తో రూ.16వేల కోట్లు సంపాదించిన సింగర్!
అమెరికన్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ‘ది ఎరాస్ టూర్’ ముగిసింది. 21 నెలల పాటు ఐదు ఖండాల్లో 149 ప్రదర్శనలు నిర్వహించగా వీటిల్లో 10 మిలియన్ల మంది పాల్గొన్నారు. మొన్న బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్‌లో జరిగిన ప్రదర్శనతో ఈ టూర్ పూర్తయింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ టూర్ ద్వారా ఆమె $2 బిలియన్లను (రూ.16వేల కోట్లు) వసూలు చేసి రికార్డు సృష్టించారు. దీంతో ఆమె బిలియనీర్ హోదాను పొందారు.
News December 10, 2024
2025 ఎలా ఉండబోతోంది.. వందల ఏళ్ల కిందటే చెప్పిన నోస్ట్రాడమస్!
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో 2025 ఎలా ఉండబోతుందో ఫ్రెంచ్ జ్యోతిషుడైన నోస్ట్రాడమస్ విశ్లేషించిన విషయాలు వైరలవుతున్నాయి. వచ్చే ఏడాది భూమిని పెద్ద గ్రహశకలం ఢీకొట్టవచ్చని, లేదా దగ్గరగా రావచ్చని అంచనా వేశారు. ‘దీర్ఘకాలిక యుద్ధం ముగుస్తుంది. బ్రెజిల్‌లో వరదలు, అగ్నిపర్వతం బద్దలవ్వడం వంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ప్లేగు వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది’ అని జోస్యం చెప్పారు.