News December 4, 2024
ఈ జిల్లాల్లో రేపు సెలవు

AP: ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ MLC ఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో స్థానికంగా రేపు సెలవు ఇవ్వాలని సీఎస్ నీరభ్ కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే పోలింగ్ ముందు రోజైన ఇవాళ కూడా సెలవు ఇవ్వాలని సూచించారు. ఓట్ల లెక్కింపు జరిపే 9వ తేదీన లెక్కింపు కేంద్రాలుగా ఉపయోగించుకునే కార్యాలయాలకు సెలవు ప్రకటించడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలన్నారు.
Similar News
News March 8, 2026
6 నెలల పాటు యుద్ధానికి సిద్ధం: IRGC

ఇరాన్-ఇజ్రాయెల్, US యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. 6 నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) స్టేట్ మీడియాకు వెల్లడించింది. ఇక అమెరికాతో యుద్ధంపై చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ఆ దేశంపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అటు శనివారం 300 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
News March 8, 2026
నేడు ఉత్తర కోస్తాలో వర్షాలు!

AP: ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు వ్యాపించిందని పేర్కొంది. దీని ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక నిన్న రాయలసీమలో ఎండలు దంచికొట్టాయి. కర్నూలులో రాష్ట్రంలోనే అధికంగా 39.4°C ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేఘాలు ఆవరించడంతో ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యాయి.
News March 8, 2026
డిగ్రీ, పీజీలో కొత్త విధానం.. కోర్సు మధ్యలో ఆపేయవచ్చు!

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంజినీరింగ్ తరహాలో డిగ్రీ, పీజీలోనూ క్రెడిట్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విధానంలో పాస్ కావాలంటే 3ఏళ్ల డిగ్రీలో కనీసం 120, 4ఏళ్ల ఆనర్స్ డిగ్రీలో 160, PGలో 80 క్రెడిట్లు సాధించాలి. డిగ్రీ, PG మధ్యలో ఆపేసి తర్వాత పూర్తి చేయవచ్చు. డిగ్రీ ఫస్టియర్‌లో మానేస్తే సర్టిఫికెట్ కోర్సుగా పరిగణిస్తారు. 2nd yrలో మానేస్తే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు.


