News December 4, 2024

ఈ జిల్లాల్లో రేపు సెలవు

image

AP: ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ MLC ఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో స్థానికంగా రేపు సెలవు ఇవ్వాలని సీఎస్ నీరభ్ కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే పోలింగ్ ముందు రోజైన ఇవాళ కూడా సెలవు ఇవ్వాలని సూచించారు. ఓట్ల లెక్కింపు జరిపే 9వ తేదీన లెక్కింపు కేంద్రాలుగా ఉపయోగించుకునే కార్యాలయాలకు సెలవు ప్రకటించడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలన్నారు.

Similar News

News January 26, 2025

వెబ్‌ సిరీస్ చూసి.. భార్యను ముక్కలుగా నరికి..

image

భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. శవాన్ని ఎలా ముక్కలు చేసి, మాయం చేయాలి? అనే విషయాలను నిందితుడు గురుమూర్తి OTTలోని ఓ క్రైమ్ వెబ్‌సిరీస్‌లో చూసినట్లు విచారణలో తేలింది. ముక్కలను కరిగించడానికి అవసరమైన కెమికల్స్ కోసం యూట్యూబ్‌ వీడియోస్ చూశాడట. సెన్సార్ కట్‌లు లేకుండా OTTలో ఏదైనా చూపించడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మీరేమంటారు?

News January 26, 2025

డా.నాగేశ్వర్‌రెడ్డి గురించి తెలుసా?

image

దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డా. నాగేశ్వర్‌రెడ్డి నిలిచారు. 2002లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ అందుకున్న ఆయనకు కేంద్రం తాజాగా పద్మ విభూషణ్ ప్రకటించింది. వైజాగ్‌లో జన్మించిన ఆయన కర్నూలులో MBBS, మద్రాస్‌లో MD, చండీగఢ్‌లో DM పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదిగి HYDలో AIG ఆస్పత్రిని స్థాపించారు. రూ.కోట్ల జీతం కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలను అందిస్తున్నారు.

News January 26, 2025

పెద్ద కర్మ రోజే ‘పద్మశ్రీ’ ప్రకటన

image

AP: బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్రం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది. కొద్దిరోజులుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న ఆయన పెద్ద కర్మ జరుగుతుండగానే అవార్డు ప్రకటన వచ్చింది. కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన అప్పారావు చిన్నప్పటి నుంచే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. సింగపూర్, కువైట్‌లో కూడా ఆయన గాత్రం వినిపించారు. అప్పారావు దాదాపు 5వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.