News September 8, 2024

మరో 5 జిల్లాల్లో రేపు సెలవు

image

APలో మరో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు రేపు సెలవు ప్రకటించారు. అతిభారీ వర్షాల దృష్ట్యా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో సెలవు ఇచ్చారు.

Similar News

News August 18, 2025

వర్షాలు ఎక్కువైతే సెలవులు పొడిగిస్తాం: మంత్రి సంధ్యారాణి

image

AP: వర్షాలు ఎక్కువగా ఉంటే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలిపారు. ఏడాదిలోనే దాదాపు రూ.1,300 కోట్లు రహదారుల అభివృద్ధికే వినియోగించామన్నారు. రాబోయే 3 ఏళ్లలో గిరిజన ప్రాంతాల్లో మెజారిటీ రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

News August 18, 2025

ఈ నెల 22న ‘మెగా157’ మూవీ గ్లింప్స్

image

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా(మెగా157) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరు జన్మదినం సందర్భంగా ఈ నెల 22న మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని డైరెక్టర్ అనిల్ ఓ టీవీ షోలో చెప్పారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

News August 18, 2025

వినాయక చవితి.. ఈ విషయాలు గుర్తుంచుకోండి!

image

ఆగస్టు 27న గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలవనున్నాయి. విగ్రహాలు నెలకొల్పేందుకు మండపాలు సిద్ధమవుతున్నాయి. అయితే మండపాల ఏర్పాట్లలో కరెంట్ తీగలు <<17438408>>తగిలే<<>> ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే అత్యవసర సమయాల్లో అంబులెన్స్, పోలీసు వాహనాలు వెళ్లేలా గల్లీల్లో దారి వదిలి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.