News September 8, 2024
మరో 5 జిల్లాల్లో రేపు సెలవు
APలో మరో 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు రేపు సెలవు ప్రకటించారు. అతిభారీ వర్షాల దృష్ట్యా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా విద్యాసంస్థలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో సెలవు ఇచ్చారు.
Similar News
News October 10, 2024
OTTలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ
బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘స్త్రీ-2’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రెగ్యులర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గత నెల 26 నుంచి రెంటల్(రూ.349) పద్ధతిలో అందుబాటులో ఉండగా, ఇవాళ్టి నుంచి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఫ్రీగా వీక్షించవచ్చు. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ.700 కోట్లను వసూలు చేసిన విషయం తెలిసిందే.
News October 10, 2024
‘మీషో’ ఆఫర్.. 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు
ఫెస్టివల్ సీజన్‌లో మెగా సేల్స్‌తో కష్టపడిన ఉద్యోగులకు ఈ కామర్స్ సంస్థ మీషో గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా నాలుగో ఏడాది 9 రోజులపాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ‘రెస్ట్ అండ్ రీఛార్జ్’ బ్రేక్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని తెలిపింది. ‘9 రోజులపాటు ల్యాప్‌టాప్స్ ఉండవు. ఈమెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు’ అని పేర్కొంది.
News October 10, 2024
ఈ క్రమశిక్షణ చూడటానికి ఎంత బాగుంది!
హైదరాబాద్ ట్రాఫిక్ అంటే.. ఖాళీలో దూరిపోయే బైకులు, ఫ్రీ లెఫ్ట్ ఉన్నా దారి వదలని కార్లు, సిగ్నల్ వ్యవస్థను పట్టించుకోని వాహనదారులతో గందరగోళం గుర్తొస్తుంటుంది. అలాంటి సిటీలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. పై ఫొటోనే అందుకు నిదర్శనం. నేరేడ్‌మెట్‌లో సింగిల్ లేన్ రోడ్డులో వాహనాలు రూల్స్‌ని పాటిస్తూ ఇలా ఒకదాని వెనుక ఒకటి ఆగాయి. ఈ క్రమశిక్షణ చూడటానికి చాలా బాగుందంటూ నెట్టింట హర్షం వ్యక్తమవుతోంది.