News August 25, 2024
రేపు కృష్ణాష్టమి.. ఏం చేయాలంటే?
పండితుల ప్రకారం.. చిన్ని కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. కృష్ణుడికి ఇష్టమైన వెన్న, పాలతో చేసిన క్షీరాన్నం, అటుకుల పరమాన్నం నివేదనగా సమర్పించాలి. బాలకృష్ణుడిని అష్టోత్తర శతనామావళితో పూజించిన వారికి అభిశతి సిద్ధిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది. కృష్ణుడిని 1,008 తులసి దళాలతో అర్చిస్తే కోరికలు నెరవేరుతాయి.
Similar News
News September 8, 2024
మరో 3 జిల్లాల్లో రేపు సెలవు
APలోని ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాజాగా 3 జిల్లాలకు సోమవారం సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ఇస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ఇప్పటికే విజయనగరం జిల్లాలో సెలవు <<14051952>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.
News September 8, 2024
ఫోన్ ఎక్కువగా వాడేవారిలో హైపర్ టెన్షన్!
ఫోన్‌ను అతిగా వాడటం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని యూకే పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్-డిజిటల్ హెల్త్’లో పబ్లిష్ అయిన ఆ నివేదిక ప్రకారం.. రోజుకు 6 గంటలకంటే ఎక్కువగా ఫోన్ వాడే వారిలో హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం 25శాతానికి పైగా ఉంటుంది. దీని కారణంగా గుండె, కిడ్నీ జబ్బులు వచ్చే రిస్క్ కూడా తీవ్రంగా ఉంటోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
News September 8, 2024
భారత్‌లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు నమోదు
భారత్‌లో మంకీపాక్స్ అనుమానాస్పద కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు పేర్కొంది. అతడిని ఐసోలేషన్‌లో ఉంచామని, వ్యాధి నిర్ధారణ కోసం నమూనాలను పరీక్షలకు పంపామంది. కాగా ఆఫ్రికాలోని బురుండి, రువాండా, కెన్యా, ఉగాండాతో పాటు స్వీడన్, థాయ్‌లాండ్ దేశాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు 926మంది మరణించారు.