News August 14, 2024
రేపే జెండా పండుగ.. ఇవి గుర్తుంచుకోండి!
పంద్రాగస్టు సందర్భంగా ప్రతిచోటా జాతీయ జెండాను ఎగురవేస్తుంటారు. అయితే, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం తిరంగ జెండాను ఆవిష్కరించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. అక్కడ ఇతర జెండాలేమైనా ఉంటే వాటికంటే పైన జాతీయ జెండా ఉండేలా చూడాలి. జెండాపై ఏం రాయొద్దు. రంగుల క్రమం సరిగ్గా ఉండేలా చూసుకోండి. కాషాయ రంగు పైకి ఉండాలి. చిరిగిన, మాసిపోయిన జెండాను ప్రదర్శించకండి. పోల్‌కి సగంలోనే జెండా ఎగరేస్తే నేరమే.
Similar News
News September 21, 2024
రేట్ల ఎఫెక్ట్.. BSNLకు పెరిగిన యూజర్లు
ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలకు 10-27 శాతం పెంచాయి. దీంతో యూజర్లు ఆ ప్రైవేటు టెలికాం కంపెనీలకు షాకిచ్చారు. జులైలో ఎయిర్‌టెల్ 16.9 లక్షలు, VI 14.1 లక్షలు, జియో 7.58 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. అదే సమయంలో BSNLలోకి ఏకంగా 29 లక్షల మంది చేరారు. ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
News September 21, 2024
భద్రతామండలిలో చేరేందుకు భారత్‌కు ఉన్న అడ్డంకులివే
ఐరాస భద్రతామండలి(UNSC)లో US, ఫ్రాన్స్, రష్యా, UK, చైనాలు శాశ్వత సభ్యదేశాలు. భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నా సభ్యత్వం మాత్రం దక్కడం లేదు. వీటో అధికారంతో చైనా మోకాలడ్డుతుండటం, ‘వీటో పవర్ లేకుండానే సభ్యత్వం’ అనే ప్రతిపాదనకు భారత్ నిరాకరణ, తాము చెప్పిన మాట భారత్ వినదేమోనన్న పశ్చిమ దేశాల అనుమానాలు, పొరుగు దేశాలపై భారత్‌కు నియంత్రణ లేకపోవడం కారణాలుగా ప్రపంచ రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
News September 21, 2024
నేను ఏసీ వ్యాన్‌లో.. రజనీ నేలమీద: అమితాబ్
రజనీకాంత్ వెట్టయాన్ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌కు ఆయన తన వీడియో మెసేజ్‌ను పంపించారు. ‘ఇది నా తొలి తమిళ సినిమా. 1991లో వచ్చిన హమ్ సినిమాలో నేను, రజనీ కలిసి నటించాం. ఆ షూటింగ్‌లో నేను ఏసీ కారవ్యాన్‌లో పడుకుంటే తను మాత్రం సెట్‌లో నేలపై నిద్రించేవారు. ఆ సింప్లిసిటీ చూశాక నేనూ బయటే పడుకునేవాడిని’ అని గుర్తుచేసుకున్నారు.