News March 19, 2024
రేపు నూతన గవర్నర్ బాధ్యతల స్వీకరణ

TG: రాష్ట్ర నూతన గవర్నర్‌గా రాధాకృష్ణన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. దీంతో ఇవాళ రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళిసై రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.
Similar News
News April 2, 2025
బుమ్రా రీఎంట్రీ మరింత ఆలస్యం?

వెన్నునొప్పితో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ బుమ్రా IPLలో ఆడేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్న ఆయన ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్ వేయలేకపోతున్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సమయంలో వెన్నులో ఎలాంటి ఫ్రాక్చర్ కాకుండా ఉండేందుకు క్రమ క్రమంగా అతడి వర్క్‌లోడ్‌ను పెంచుతున్నట్లు తెలుస్తోంది. మరో 2 వారాల్లో ఆయన MIకి అందుబాటులోకి వస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి.
News April 2, 2025
CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

TG: MLAల అనర్హత కేసు విచారణ సందర్భంగా CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నికలు రావని అసెంబ్లీలో ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ‘ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో CM ప్రకటిస్తే అది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమే. అవసరమైతే దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని CMకు హితవు చెప్పాలి’ అని స్పీకర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
News April 2, 2025
‘విశ్వంభర’ కోసం సింగర్‌గా మారిన మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈక్రమంలో అంచనాలు మరింత పెంచేందుకు మెగా గాత్రాన్ని వాడుకునేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సినిమాలో ఓ పాట పాడేందుకు చిరు ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అప్డేట్ రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.