News April 22, 2025

రేపే టెన్త్ ఫలితాలు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైంది. రేపు ఉ.10 గంటలకు రిజల్ట్స్‌ను విద్యాశాఖ ప్రకటించనుంది. MAR 17 నుంచి APR 1 వరకు జరిగిన పరీక్షలకు 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. Way2News యాప్ ద్వారా వేగంగా, సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్క్స్ లిస్ట్ వస్తుంది. దాన్ని ఈజీగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
విద్యార్థులందరికీ Best Of Luck

Similar News

News April 9, 2026

హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తున్నట్లు అక్కడి మీడియా ప్రకటించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని నౌకలు హార్ముజ్ దాటడానికి ప్రయత్నిస్తే ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. కాగా తాజా పరిస్థితులపై పాక్ ప్రధాని షెహబాజ్‌తో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ USతో డీల్ కుదరాలంటే లెబనాన్‌పై దాడులు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు.

News April 8, 2026

ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే.. ఇరాన్ కీలక ప్రకటన

image

తమ మిత్రదేశం లెబనాన్‌పై ఇజ్రాయెల్ <<19601083>>దాడులు<<>> కొనసాగిస్తే USతో సీజ్‌ఫైర్ అగ్రిమెంట్‌ను వెనక్కి తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ‘హామీ ఇచ్చి బ్రేక్ చేయడం ఇజ్రాయెల్‌కు అలవాటే. ఆ దేశానికి బుల్లెట్లతోనే సమాధానం చెప్పాలి’ అని ఇరాన్ అధికారి ఒకరు Al Jazeeraతో అన్నారు. మరోవైపు లెబనాన్‌పై వెంటనే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను UN డిమాండ్ చేసింది.

News April 8, 2026

లులూ మాల్‌‌కు భూకేటాయింపు రద్దు

image

AP: విజయవాడలో లులూ మాల్‌ నిర్మాణానికి గతంలో ఇచ్చిన ప్రాథమిక అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. కాగా గతంలో పాత బస్టాండ్ ఏరియాలో APSRTCకి చెందిన 4.15 ఎకరాల భూమిని ప్రభుత్వం లులూ గ్రూప్‌కు కేటాయించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిల్ దాఖలైంది. దానిపై ఇవాళ విచారణ సందర్భంగా కోర్టుకు AG ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.