News November 12, 2024

యాసంగి నుంచి రైతులకు సబ్సిడీపై పనిముట్లు, యంత్రాలు

image

TG: యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడానికి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షించారు. ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా సిద్ధం చేశామని, మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

Similar News

News November 11, 2025

ఏపీ టుడే

image

* జిల్లా కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ దినోత్సవం.. విజయవాడలో రాష్ట్ర స్థాయి వేడుకలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు
* ప్రకాశం జిల్లా పీసీపల్లిలో 50 MSME పార్కులు వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
* ఇవాళ బాపట్ల, కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం. మొంథా తుఫానుతో పంట నష్టం పరిశీలన
* శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మైదానంలో ‘సిక్కోలు పుస్తక మహోత్సవం’.. ఈ నెల 20 వరకు నిర్వహణ

News November 11, 2025

మంగళవారం రోజున ఇలా చేయకపోవడం ఉత్తమం

image

మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈరోజు మద్యం, మాంసాహారం, మత్తు పదార్థాలు సేవించకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. మంగళ దోషం తొలగిపోయే ఈరోజున బిచ్చగాళ్లు, పేదలు, వికలాంగులు, వృద్ధులను అవమానించకూడదని అంటున్నారు. ‘తల్లి, సోదరి, భార్య సహా స్త్రీలను దైవస్వరూపంగా భావించాలి. శివుడిని గౌరవించాలి. శివపూజలు చేయాలి. ఈ నియమాలు పాటిస్తే ఆంజనేయుడు తప్పక అనుగ్రహిస్తాడు’ అని సూచిస్తున్నారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

image

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్‌లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.