News March 16, 2024
ఏపీలోని మొత్తం ఓటర్లు 4.08 కోట్లు

➣రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య: 4,08,07,256
➣175 నియోజకవర్గాల్లో రిజర్వ్‌డ్ స్థానాలు: లోక్‌సభ(4 ఎస్సీ, ఒక ఎస్టీ), అసెంబ్లీ(29 ఎస్సీ, 7 ఎస్టీ)
➣పురుష ఓటర్లు: 2 కోట్లకుపైగా ➣మహిళా ఓటర్లు: 2.07 కోట్లకుపైగా
➣థర్డ్ జెండర్: 3,482 ➣సర్వీస్ ఓటర్లు: 67,434 ➣NRI: 7,603
➣మహిళలతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు(PS):178 ➣యువతతో నిర్వహించే PSలు: 50 ➣555 ఆదర్శ PSలు.
Similar News
News February 15, 2025
బాంబూ సాల్ట్.. కిలో రూ.30,000

ఉప్పు బ్రాండ్లను బట్టి KG ₹30-₹200 వరకు ఉంటుంది. అయితే కొరియన్/బాంబూ సాల్ట్ ధర ₹20-30K. దీన్ని తొలుత కొరియాలో తయారుచేసేవారు. వెదురు బొంగులో సముద్రపు ఉప్పును నింపి 400డిగ్రీల వద్ద కాల్చుతారు. ఇలా 9సార్లు చేస్తే స్పటిక రూపంలోకి మారుతుంది. KG తయారీకి 20D పడుతుంది. ఇందులో 73మినరల్స్ ఉంటాయి. దీన్ని వాడితే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ సర్కార్ దీన్ని తయారుచేస్తోంది.
News February 15, 2025
సిన్నర్‌పై డోపింగ్ ఆరోపణలు.. మూడు నెలలు నిషేధం

మెన్స్ టెన్నిస్ నం.1 ప్లేయర్ జన్నిక్ సిన్నర్‌కు భారీ షాక్ తగిలింది. డోపింగ్‌లో పట్టుబడ్డ అతడిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించింది. ఫిజియోథెరపీ సమయంలో ఉత్ప్రేరకం తన శరీరంలోకి వెళ్లిందని సిన్నర్ ఆంగీకరించారు. WADA కూడా సిన్నర్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి మోసం చేయలేదని పేర్కొంది. అయినా FEB 9- మే 4 వరకు నిషేధం అమల్లో ఉంటుందంది. కాగా ఇటీవల సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు.
News February 15, 2025
భారత్‌లో పర్యటించనున్న ఖతర్ దేశాధినేత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీ ఈ నెల 17-18 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నట్లు తెలిపింది.