News March 30, 2024

దమ్ముంటే టచ్ చేసి చూడండి: పొన్నం

image

TG: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమతో కాంగ్రెస్ మంత్రులు టచ్‌లో ఉన్నారన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి <<12955060>>కామెంట్స్‌కు<<>> మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ‘దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి. దేనినైనా ఎదుర్కొనే శక్తి మాకుంది’ అని సవాలు విసిరారు.

Similar News

News March 9, 2026

‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

image

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనాలని అనుకునేవారు <>mygov.in<<>>లో మొబైల్ నంబర్/మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. మార్చి 20 ఈ పోటీకి చివరి తేదీ. కాగా వీబీ జీ రామ్ జీ స్కీమ్‌లో భాగంగా పని దినాలను 100 నుంచి 125కి పెంచింది.

News March 9, 2026

ఆస్తుల్లో ప్రశాంతిరెడ్డి టాప్

image

దేశవ్యాప్తంగా ఉన్న <<19333433>>మహిళా ప్రజాప్రతినిధుల్లో<<>> 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్‌లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, TGలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.

News March 9, 2026

అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

image

చైల్డ్ పోర్నోగ్రఫీపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్‌లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B, పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది. అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది. అశ్లీల వీడియోలను ఫోన్‌లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.