News March 17, 2024
గాజువాకలో అమర్నాథ్కు టఫ్ టైమ్?
AP: YCP జాబితాలో ఉత్తరాంధ్రలో పెద్దగా మార్పులు లేవు. కానీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు మాత్రం స్థానచలనం తప్పలేదు. అతడిని గాజువాక MLAఅభ్యర్థిగా ప్రకటించింది. విజయం కోసం అతడు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ TDP అభ్యర్థి పల్లా వాసుపై సానుభూతి ఉందని.. BJP, JSP వైపు నుంచి మద్దతు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో గుడివాడకు అక్కడ టఫ్ టైమ్ నడుస్తున్నట్లు చెబుతున్నారు.
Similar News
News November 24, 2024
అక్కడ ఆఫీసర్ల కంటే ఖైదీలకే జీతాలెక్కువ..!
యూకేలోని జైళ్లలో ఖైదీల ఆదాయం అక్కడి అధికారులు, టీచర్ల కంటే ఎక్కువగా ఉంది. ఒక్కో ఖైదీ ఏడాదికి సుమారుగా రూ.39 లక్షలు సంపాదిస్తారు. కొంచెం పని తక్కువ చేసే ఖైదీలు ఏటా రూ.24 లక్షలు గడిస్తారు. ఇది అక్కడి జైలు గార్డు జీతంతో దాదాపుగా సమానం. గార్డులకు రూ.29 లక్షల వరకు జీతమిస్తారు. కాగా అక్కడి ఖైదీలు జైల్లో నుంచి బయటకు వెళ్లి పనులు చేసుకోవచ్చు. లారీ, బస్సు డ్రైవర్లుగా కూడా వారు పనిచేస్తున్నారు.
News November 24, 2024
పంజాబ్ కింగ్స్‌పై క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
PBKS ఫ్రాంచైజీపై క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ సంచలన ఆరోపణలు చేశారు. IPLలో ఆ జట్టులో మళ్లీ ఆడటం తన వల్ల కాదని తేల్చిచెప్పారు. గౌతమ్ 2020లో పంజాబ్ తరఫున ఆడారు. ‘నేను ఏ జట్టుకు ఆడినా నా 100 శాతం ప్రదర్శన ఇస్తాను. కానీ పంజాబ్‌కు అలా ఆడలేను. క్రికెట్పరంగానే కాక ఇతర వ్యవహారాల్లోనూ ఆ జట్టుతో నాకు మంచి అనుభవం లేదు. క్రికెటర్‌గా నన్ను ఎలా ట్రీట్ చేయాలనుకుంటానో అలా వారు వ్యవహరించలేదు’ అని స్పష్టం చేశారు.
News November 24, 2024
చిన్న డెస్క్‌లో పనిచేయిస్తున్నారంటూ రూ.38 కోట్ల దావా
తన ఎత్తు, బరువుకు సరిపోని డెస్క్‌లో బలవంతంగా పనిచేయిస్తున్నారంటూ న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ ఉద్యోగి విలియం మార్టిన్ కోర్టులో రూ.38 కోట్లకు దావా వేశారు. ‘నా ఎత్తు 6.2 అడుగులు. బరువు 163 కేజీలు. నా డెస్క్ చాలా చిన్నగా ఉంది. దీనివల్ల నాకు శారీరక, మానసిక సమస్యలు తలెత్తాయి’ అని పేర్కొన్నారు. అయితే అతను ఆఫీసులో నిద్రపోతుండటంతో సస్పెండ్ చేశామని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కంపెనీ తెలిపింది.