News January 7, 2025

త్వరలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు: దుర్గేశ్

image

AP: త్వరలో విశాఖ, తిరుపతిలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. సచివాలయంలో పర్యాటక పెట్టుబడులపై పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సాధ్యాసాధ్యాలు చూసి ఆయా ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని సూచించారు. త్వరలో పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తానని అధికారులకు ఆయన చెప్పారు. అటు పర్యాటక ప్రదేశాల్లో పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు.

Similar News

News July 10, 2025

PIC OF THE DAY

image

TG: గురుపౌర్ణమి వేళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నిశీధిలో ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుండగా గోపురంపై నిండు చంద్రుడు ఆసీనుడైనట్లు కనిపిస్తున్న చిత్రం కనువిందు చేస్తోంది. కాగా గురుపౌర్ణమి సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

News July 10, 2025

17వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ సిద్ధం: పొన్నం

image

TG: నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో 60వేల ఉద్యోగాలు ఇచ్చాం. 17వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల‌పై ఆఫీసర్స్ కమిటీ వేసి స్ట్రీమ్‌లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి వివరించారు.

News July 10, 2025

భూకంపాలు ఎందుకు వస్తాయంటే?

image

భూమి ఆకస్మికంగా కంపించడాన్నే భూకంపం అంటారు. భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లు బలంగా కదిలినప్పుడు భూకంపం వస్తుంది. భూపాతాలు, హిమపాతాలు, సొరంగాలు, గనుల పైకప్పులు కూలినప్పుడు ఇవి సంభవిస్తాయి. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రకంపనలు చాలా దూరం వ్యాపిస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 7 దాటితే భవనాలు పేకమేడల్లా కూలుతాయి. రోడ్లు చీలిపోతాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది.