News December 12, 2024
టూరిస్టులు లేక దీనస్థితిలో గోవా!
ఇండియన్ టూరిజం ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే గోవాలో ప్రస్తుతం సందడి తగ్గింది. ఈ ఏడాది గోవాలో తక్కువ మంది పర్యటించినట్లు తెలుస్తోంది. భారత టూరిస్టులంతా థాయ్‌లాండ్, మలేషియాకు వెళ్తున్నారు. గోవాలో సరైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు లేకపోవడం, టాక్సీల దోపిడీ వల్ల టూరిస్టులు వచ్చేందుకు మొగ్గు చూపట్లేదని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 17, 2025
రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల
TG: గ్రూప్-2 ‘కీ’ రేపటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో వస్తుందని టీజీపీఎస్సీ పేర్కొంది. ఈనెల 18 నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను తెలపొచ్చని వెల్లడించింది. కాగా డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్ష జరిగింది.
News January 17, 2025
సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడేళ్ల కొడుకు
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్‌ను అతడి పెద్ద కొడుకు ఇబ్రహీం హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే సైఫ్ వెంట ఏడేళ్ల కుమారుడు తైమూర్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఒళ్లంతా రక్తంతో ఉన్న వ్యక్తి చిన్న పిల్లాడితో కలిసి తన ఆటో ఎక్కాడని, ఆసుపత్రికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారని డ్రైవర్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ఆయనను సైఫ్‌గా గుర్తుపట్టినట్లు అతడు చెప్పారు.
News January 17, 2025
ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదు: కుమారస్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తేవడమే కేంద్రం లక్ష్యమని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రానున్న రెండు, మూడేళ్లలో ప్లాంట్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా చేస్తామన్నారు. ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదని స్పష్టం చేశారు. ఇవాళ ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ మొదటిదేనని, భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సాయాల ప్రకటనలు చేస్తామని పేర్కొన్నారు.