News October 14, 2024
మిడిల్ క్లాస్ కోసం అమరావతిలో టౌన్‌షిప్స్
AP: మిడిల్ క్లాస్ కోసం అమరావతిలో మరిన్ని టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని CRDA భావిస్తోంది. మార్కెట్ కంటే తక్కువ ధరలకే ఫ్లాట్లు ఇచ్చేందుకు వీలుగా NTR ఎంఐజీ టౌన్‌షిప్‌లను నిర్మించనుంది. దీని కోసం ర్యాపిడ్ గ్రోత్ ఉండే వీజీటీఎం ఉడా పరిధిలోని భూములు, ప్రైవేట్ భూముల కోసం అన్వేషిస్తోంది. భూములిచ్చే రైతులకూ కొన్ని ఫ్లాట్లను ఇవ్వనుంది. ఇప్పటికే 4 టౌన్‌షిప్‌లకు వేలం వేయగా రూ.46.91 కోట్ల ఆదాయం వచ్చింది.
Similar News
News November 9, 2024
ట్రంప్‌పై హత్యకు ఇరాన్ వ్యక్తి ప్లాన్: అమెరికా
డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్‌కు చెందిన షకేరీ అనే వ్యక్తి కుట్ర చేశాడని అమెరికా న్యాయ శాఖ తాజాగా ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వం తరఫున అతడు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని పేర్కొంది. చిన్నప్పుడే అమెరికాకు వచ్చిన అతడిని 2008లో ఓ చోరీ కారణంగా ఇరాన్‌కు US పంపించేసిందని వివరించింది. ఈ ఏడాది అక్టోబరు 7న ట్రంప్‌ను హత్య చేసేందుకు కొంతమంది తనకు ప్లాన్ అందించారని అతడు తమకు చెప్పినట్లు స్పష్టం చేసింది.
News November 9, 2024
చట్టాలను ఉల్లంఘించిన స్విగ్గీ, జొమాటో: నివేదిక
స్విగ్గీ, జొమాటో సంస్థలు భారత్‌లో కాంపిటీషన్ చట్టాలను అతిక్రమించాయని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) తేల్చింది. తమ యాప్‌లలో కొన్ని హోటళ్లకు ప్రాధాన్యాన్ని ఇచ్చి, వాటికి లాభాన్ని చేకూర్చేలా రెండు కంపెనీలు వ్యవహరించాయని పేర్కొంది. దీనికోసం ఆయా హోటళ్లతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయని ఆరోపించింది. ఈ విషయంలో వాటిపై ఎటువంటి పెనాల్టీ విధించాలన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.
News November 9, 2024
T20I: భారత్ తరఫున అత్యధిక సెంచరీలు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(5) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (4), కేఎల్ రాహుల్ (2), సంజూ శాంసన్ (2) ఉన్నారు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలు చేసిన సంజూ ఈ జాబితాలో కేఎల్ సరసన చేరారు.