News September 23, 2024

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: టీపీసీసీ చీఫ్

image

TG: కార్యకర్తలు, నాయకులకు అనునిత్యం అందుబాటులో ఉంటానని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులం, మతం పేరుతో ప్రధాని మోదీ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

Similar News

News October 24, 2025

బస్సు ప్రమాదం: తెలంగాణ ప్రభుత్వం పరిహారం

image

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో రాష్ట్రవాసులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడమే కాకుండా పరిహారం ప్రకటించింది. <<18088909>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున రేవంత్ సర్కార్ పరిహారం ప్రకటించింది. ఇప్పటికే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను నియమించింది. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.

News October 24, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించే ఆహారాలివే..

image

ప్రస్తుతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం వల్ల క్యాన్సర్ తీవ్రతను తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే దానిమ్మ, సోయా ఉత్పత్తులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉసిరికాయ, పియర్, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

News October 24, 2025

ఈ రోజు రాత్రి ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్నారు. దానికోసం ఈ రోజు రాత్రి దేశ రాజధానికి బయల్దేరనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.