News September 23, 2024
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: టీపీసీసీ చీఫ్
TG: కార్యకర్తలు, నాయకులకు అనునిత్యం అందుబాటులో ఉంటానని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులం, మతం పేరుతో ప్రధాని మోదీ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News October 7, 2024
ఇవాళ రా.9 నుంచి ఘాట్రోడ్డులో బైక్, ట్యాక్సీలపై నిషేధం
AP: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శ్రీవారికి కీలకమైన గరుడవాహన సేవ జరగనుంది. ఈ వేడుకను వీక్షించేందుకు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వాహన రద్దీని నియంత్రించడానికి ఇవాళ రా.9 నుంచి ఎల్లుండి ఉ.6 గంటల వరకు బైకులు, ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతిని నిరాకరించారు. రేపు సా.6.30 నుంచి రా.11 గంటల వరకు మలయప్పస్వామి గరుడ వాహనంపై విహరించనున్నారు.
News October 7, 2024
వ్యోమగాముల ఆహారంగా గ్రహశకలాలు
దీర్ఘకాల స్పేస్ మిషన్లలో వ్యోమగాముల ఆహార అవసరాలు తీర్చడానికి సైంటిస్టులు కొత్త పద్ధతిపై అధ్యయనం చేస్తున్నారు. ‘పైరోలిసిస్’ ప్రక్రియతో ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి తినదగిన ఆహారంగా మార్చొచ్చు. ఇదే తరహాలో గ్రహశకలాల నుంచి కార్బన్ను సంగ్రహించి పోషకాలుగా మార్చడంపై పనిచేస్తున్నారు. భూమిపై పడిన ఉల్కలపై సూక్ష్మజీవులు వృద్ధి చెందడాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది.
News October 7, 2024
ఈ ఏడాది SBIలో 10,000 ఉద్యోగాలు
ప్రభుత్వరంగ బ్యాకింగ్ దిగ్గజం SBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎంట్రీ లెవెల్ నుంచి హైలెవెల్ వరకు దాదాపు 1,500 మంది టెక్నికల్ సిబ్బంది నియామకానికి ఇటీవల ఉద్యోగ ప్రకటన చేశామన్నారు. కొత్త ఉద్యోగాల్లో డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్ట్స్, నెట్వర్క్ ఆపరేటర్స్ వంటివి ఉన్నట్లు తెలిపారు.