News April 11, 2025

అమెరికాలో క్రిస్‌మస్‌ సంబరాలపై ట్రేడ్‌ వార్ ఎఫెక్ట్..?

image

US, చైనా ట్రేడ్‌ వార్ ఎఫెక్ట్ అమెరికాలో క్రిస్‌మస్‌ సంబరాలపై పడేలా కనిపిస్తోంది. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌కు వినియోగించే డెకరేషన్ వస్తువులు 87శాతం వరకూ చైనా నుంచే దిగుమతి చేసుకుంటారు. కాగా ఇప్పుడు పెరిగిన సుంకాలతో వాటి ధరలు రెట్టింపవుతాయి. కనుక ఈ వస్తువులను కొనడం అమెరికన్లకు చాలా భారంగా మారుతుంది. ఏప్రిల్‌లోనే ఆర్డర్స్ రావాల్సి ఉన్నా ఈ సుంకాల పెంపుతో ఇప్పటివరకూ రాలేదని చైనా కంపెనీలు అంటున్నాయి.

Similar News

News February 2, 2026

జేఈఈ మెయిన్ దరఖాస్తుకు FEB 25 వరకు గడువు

image

JEE మెయిన్ తుది విడత పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీల మధ్య జరగనున్నాయి. జేఈఈ తొలి విడత పరీక్షలు జనవరి 29తో ముగిశాయి. వీటి ఫలితాలను ఈ నెల 12వ తేదీలోపు వెల్లడించనున్నారు.

News February 2, 2026

కంది మొక్కలను వరి పొలం గట్లపై పెంచితే ఏమిటి లాభం?

image

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.

News February 2, 2026

హైదరాబాద్‌లోని IIMRలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>HYD<<>>లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌‌(IIMR)లో 7 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ( అగ్రికల్చర్ సైన్స్, లైఫ్ సైన్స్), PG(అగ్రికల్చర్ ఎకనామిక్స్/ABM/అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్& అల్లైడ్ సైన్స్/ అగ్రికల్చర్/ ఫుడ్ టెక్నాలజీ), BE, BTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. FEB 5, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.millets.res.in/